స్వతంత్ర దినోత్సవం వేడుకలు
రణస్థలం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 26
స్వాతంత్ర్యం 1947 ఆగష్టు 15 న వచ్చినప్పటికీ , మనకంటూ కొత్త రాజ్యాంగం వచ్చేంత వరకు , బ్రిటిష్ కాలంలో రూపొందించిన భారతీయ చట్టం - 1935 ప్రకారమే మన దేశపాలన జరిగింది డా బాబా సాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన 1950 జనవరి 26 న , మనం రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది
రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చింది చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టంగా పేర్కొంది వయసు లింగము జాతి మతము కుల భేదాలు లేకుండా అందరికీ సమానమైన పౌరహక్కులు మానవ హక్కులు ఉన్నాయంది
భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు భారత రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత పౌరులుగా ప్రతీ ఒక్కరు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా నడుచుకోవాలని ఆకాంక్షిస్తున్నామూ సమరయోధుల పోరాట బలం అమర వీరుల త్యాగఫలం
బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం మన గణతంత్ర దినోత్సవం సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని భరతజాతి సంపూర్ణ స్వేచ్ఛను పొందిన రోజు అని పేర్కొన్నారు అపార త్యాగాల ఫలితంగా సిద్దించిన స్వాతంత్ర్యాన్ని పరిపూర్ణం చేసి, జాతీయ సమైక్యతను సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తోంది భారత రాజ్యాంగం అని కొనియాడారు భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించి నేటికి 75 ఏళ్లు పూర్తై 76వ ఏటలో అడుగుపెడుతున్న సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అన్ని మాట్లాడుతూ తెలియపరిచారు
జె. ఆర్. పురం పంచాయితీ సర్పంచ్ రమణ .జె. ఆర్. పురం పంచాయతీ గ్రేడ్ వన్ కార్యదర్శి ప్రసాద్ వైస్ ఎంపీపీ భుజంగరావు
ఎంపిటిసి ప్రతినిధి సాయిరాం
మరియు కూటమి నాయకులు.. మాజీ ఎంపీపీ డిజిఎం ఆనందరావు 1, 2సచివాలయం ఉద్యోగస్తులు
డీజిఎం శ్రీను. వార్డ్ మెంబర్ సుంకరి రమణ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన అధ్యక్షులు దన్నాన చిరంజీవి
విద్యార్థులు పారిశుద్ధ్య కార్మికులు
శానిటేషన్ మేస్త్రి పాణీ కుమార్ తదితరులు పాల్గొన్నారు
నాయకులు అధికారులు ప్రభుత్వం నుంచి వచ్చిన పారిశుద్ధ్య సిబ్బందికి వచ్చిన దుస్తులు మరియు హెల్మెట్లు బూట్లు చేతి బ్లౌజులు పారిశుధ్య కార్మికులకు అందజేశారు
పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ నాయకులతో మాట్లాడుతూ
జె. ఆర్ పురం పంచాయితీలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉందని
ప్లాస్టిక్ వాడకం పంచాయతీలో నిషేధించాలనిదీనికి నాయకులు సంపూర్ణ సహకారం అందించాలని నాయకులకు పంచాయతీ కార్యదర్శి
ప్రసాదు వివరించారు