ఎ.పీ.ఓ. ఎస్. హరినాధ్ కు మరియు ఆర్.డబ్ల్యు.ఎస్.
ఏ.ఈ,చరణ్ కి ప్రతిభా పురస్కారం.
రేగిడి జనవరి 26 వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్
76 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతిభ కనబర్చిన రేగిడి మండలం నుంచి ఉపాధి హామీ పథకం ఎ.పీ.ఓ సంకాబత్తుల హరినాధ్ కు మరియు నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం విభాగం నుండి ఏ.ఈ.గా పనిచేస్తున్న జి. చరణ్ కు ప్రతిభా పురస్కారం లభించింది.ఈమేరకు ఈ రోజు విజయనగరం జిల్లా కలెక్టర్ గారు చేతుల మీదుగా ప్రతిభా పురస్కార అవార్డులును అందుకున్నారు. ఈ సందర్భంగా ఏపీవో మరియు ఏఈ మాట్లాడుతూ, మా ఉద్యోగంలో బాధ్యతగా పనిచేసినందుకు,ప్రతిభను గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని, ఈ అవార్డు రావడం వలన ఉద్యోగ విధులపై మరింత బాధ్యతను పెంచిందని అన్నారు, ఈ సందర్భంగా విజయనగరం ఉపాధి హామీ పధక సంచాలకులు శారదాదేవి హరినాధ్ ను మరియు ఏ.ఈ చరణ్ ను విజయనగరం జిల్లా నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగం అధికారి కవిత అభినందించారు మరియు రేగిడిఆమదాలవలస మండలం అభివృద్ధి అధికారి శ్యామల కుమారి మరియు అధికారులు వీరు ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు.