Sidebar


Welcome to Vizag Express
ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు

26-01-2025 18:27:21

ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు 
రేగిడి జనవరి 26 వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్ 
రేగిడి ఆమదాల వలస మండలం లక్ష్మీపురం మండల పరిషత్ ఆదర్శ పాఠశాల లో స్కూల్ హెచ్ఎం మురపాక వెంకటరమణ ఆధ్వర్యంలో  76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో భాగంగా హెచ్ఎం జండాని ఎగరవేసి సభను నిర్వహించారు. సభను ఉద్దేశించి హెచ్ఎం మరియు స్కూల్ చైర్మన్, గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఈనాడు ఇంత స్వేచ్ఛగా ఉన్నామoటే ఎంతోమంది దేశ నాయకుల ప్రాణాలను లెక్కచేయకుండా  పోరాడారని ,వాళ్ళని ఎప్పుడూ మనము స్మరించు కోవాలని,ప్రతి ఒక్క పౌరుడు దేశభక్తి కలిగి ఉండాలని, కొన్ని ముఖ్యమైన విషయాలు విద్యార్థులకు తెలియపరిచారు, ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ మీసాల సత్యనారాయణ, ఎంపీటీసీ ఏర్నేన అప్పల నాయుడు, యలకల కృష్ణారావు, వైసీపీ యువ నాయకులు కెంబూరు గోవిందరావు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు