వాడు..వాడలా గణతంత్ర దినోత్సవ వేడుకలు
గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 26,
ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్, జీ.వీ.ఎం.సీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావు
జీ.వీ.ఎం.సీ 76 వార్డు లో వాడ వాడలా 78వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కార్పొరేటర్, జీ.వీ.ఎం.సీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. నడుపూరు, హౌసింగ్ బోర్డు కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, డైరీ కాలనీ, బర్మా కాలనీ, చిన నడుపూరు తదితర ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా గంధం శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చి గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతీ ఏడాది కన్నుల పండుగగా నిర్వహించడం అభినంద నియమని అన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్య క్రమంలో మంత్రి రాజశేఖర్, మంత్రి శంకర నారాయణ, ఆర్మీ గోవింద్, రాజ, వంశీ, మణి, అనిల్, సతీష్, బొడ్డు సత్యారావు, పిల్లి అప్పారావు, ప్రమోద్, రాజ్ కుమార్ తది తరులు పాల్గొన్నారు.