76 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్..
పాతపట్నం ,వైజాగ్ ఎక్స్ప్రెస్- జనవరి 26 .
పాతపట్నం నియోజకవర్గం కేంద్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవం వేడుకలు కు ముఖ్య అతిథిగా హాజరైన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అధికారులకు నాయకులకు విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం, ఎంపీడీవో గారిచే జాతీయ జెండాను ఆవిష్కరన చేయించారు,ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్రం కోసం త్యాగం చేసిన మహనీయుల సేవలు చిరస్మరణీయంగా ఉండిపోతాయన్నారు.రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సేవలు అమోఘమని,ఆయన వల్లే నేడు అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు.
అనంతరం విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు కార్యక్రమంలో మండలనాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.