Sidebar


Welcome to Vizag Express
ఎన్ పిఎఫ్‌ఎఎంను తిరస్కరిస్తూ అసెంబ్లీల్లో తీర్మానం ఆమోదంచండి .

27-01-2025 09:33:31

ఎన్ పిఎఫ్‌ఎఎంను తిరస్కరిస్తూ అసెంబ్లీల్లో తీర్మానం ఆమోదంచండి .

 కాశీబుగ్గలో వామపక్ష ప్రజా సంఘాల నేతల డిమాండ్‌

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి ,26 :

   రిపబ్లిక్ డే రోజున ఆదివారం.  కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద వామపక్షాలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆపార్టీ నాయకులు మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ మార్కెట్లను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ఉద్దేశించిన జాతీయ విధాన కార్యాచరణ (ఎన్‌పిఎఫ్‌ఎఎం)ను తిరస్కరిస్తూ  అసెంబ్లీల్లో తీర్మానం ఆమోదించాలని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. సంయుక్త కిసాన్‌  మోర్చా నేతృత్వంలో శంభు, ఖన్నౌరి సరిహద్దుల్లో పోరాడుతున్న   రైతు సంఘాల నాయకత్వంతో   కేంద్ర ప్రభుత్వ తక్షణమే చర్చించి వ్యవసాయ మార్కెటింగ్‌ విధాన ఫ్రేమ్‌వర్క్‌పై స్పష్టమైన వైఖరి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చారిత్రాత్మక రైతు ఉద్యమం తరువాత కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న మూడు నల్ల చట్టాలను కొత్త వ్యవసాయ మార్కెటింగ్‌ ముసాయిదాతో ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకొస్తోందని వారు విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్ర అసెంబ్లీలు ఈ విధానానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించి ప్రధానమంత్రికి సమర్పించాలని డిమాండ్‌ చేశారు. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో ఈ విధానానికి వ్యతిరేకంగా పార్లమెంటు సభ్యులందరి ఇళ్లకు, కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తామని తెలిపారు. ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ద్వారానే ఒత్తిడిని తీసుకుని వస్తామన్నారు.మరియు స్వామినాదన్  కమిషన్ సంపూర్ణంగా అమలుచేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గొరకల బాలకృష్ణ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి   తామాడ సన్యాసిరావు,ఎఐకేయం జిల్లా నాయకులు మద్దిల రామారావు, ఎఐసిసిటియు కుత్తుం దుష్యంత్,  దున్న.శ్రీనివాస్, నాగేశ్వరరావు,   పి డి ఎస్ యు రాష్ట్ర నాయకులు యం. వినోద్ , పి వో డబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ,  ఐ ఎఫ్ టి యు నాయకులు బర్ల గోపి, ఏ ఐ కె యం యస్ నాయకులు అప్పయ్య, పలు ప్రజా సంఘాల నాయకులు పోతనపల్లి కామేశ్వరరావు, శ్రీను, లోకనాథము తదితరులు పాల్గొన్నారు.