చదువుంటే చాలదు ,సంస్కారం ఉండాలి!
రద్దైన బోర్డుకు మెంబర్ అంటూ గొప్పలేల!
బత్తిని పై బావన విమర్శలు
సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 26:
గడువు ముగిసింది ,ప్రభుత్వం అధికారం కోల్పోయింది. అయినా ఇంకా అదే భ్రమలో ఉండటం ఏమిటని రాష్ట్ర కాళింగ కార్ఫోరేషన్ డైరెక్టర్ బావన ధుర్యోధన ఓ వైకాపా నాయకుడు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. గౌరవ సభ్యుడిగా లెటర్ హెడ్స్ వినియోగం పై హార్టీకల్చర్ యూనివర్సిటీ తలంటినా
వైసీపీ నాయకులకు అధికార యావ ఇంకా తీరినట్టు లేదని, ఓటమి పాలైనా ఇంకా తాను అధికారంలోనే ఉన్నట్టు భ్రమించే ఇక్కడి నాయకుడి తోకలు కూడా అప్పట్లో పలు నామినేటెడ్ పోస్టుల్లో బాధ్యతలు వెలగబెట్టారని మందస మండల టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ భావన దుర్యోధన మండిపడ్డారు.
రద్దయిపోయిన బోర్డులకు ఇంకా సభ్యులమని చెప్పుకుంటూ తిరగడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. మందస మండలానికి చెందిన ఓ యువకుడికి వైసీపీ ప్రభుత్వ హయాంలో హార్టీకల్చర్ యూనివర్సిటీలో సభ్యుడిగా అవకాశం కల్పించారని, ఆ బోర్డును రద్దు చేసినట్టు ఆ యూనివర్సిటీ ప్రకటించినప్పటికీ అదే పేరిట లెటర్ హెడ్స్ వినియోగిస్తూ అక్కడి అధికారులతో చీవాట్లు తినలేదా అని ప్రశ్నించారు. రాజీనామా పంపించాలని అడిగినప్పటికీ తానింకా సభ్యుడినేనని భ్రమల్లో బతికేస్తూ ఇక్కడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేనిపక్షంలో ఆ యూనివర్సిటీ అధికారులే ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని రాసిన లేఖను కూడా ఈ ప్రకటనతో పాటు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు.