Sidebar


Welcome to Vizag Express
ఏ ఎల్ పురం అంబేద్కర్ విగ్రహం వద్ద గణతంత్ర వేడుకలు

27-01-2025 09:35:26

ఏ ఎల్ పురం అంబేద్కర్ విగ్రహం వద్ద గణతంత్ర వేడుకలు

 గొలుగొండ,

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏ ఎల్ పురం మేజర్ పంచాయతీలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి భారీ విగ్రహం వద్ద స్థానిక అంబేద్కర్ యువజన సంఘం పెద్దలు లోచల ధర్వీజు, రేముల నాగేశ్వరరావు, గజ్జలపు సత్యనారాయణ, గోకాడ చిట్టిబాబు, గుద్దాటి కృష్ణ, కర్రి ప్రకాశరావు   అంబేద్కర్ యూత్ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి 76వ గణతంత్ర్య వేడుకలలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న గ్రామ ప్రధమ పౌరురాలు జిల్లా వైయస్సార్సీపి మహిళా అధ్యక్షురాలు  శ్రీమతి లోచల సుజాత, స్థానిక ఎ.ఆర్. ఎస్సై  సాయి ప్రకాష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా ఎ.ఆర్.ఎస్.ఐ సాయి ప్రకాష్ జాతీయ పతాక ఆవిష్కరణ చేయగా గ్రామ సర్పంచ్ సుజాత అంబేద్కర్ యువజన సంఘం పెద్దలు అంబేద్కర్ భారీ విగ్రహానికి గజమాలతో పూలమాల ఆవిష్కరణ చేసి ఘన నివాళులర్పిస్తూ 76వ గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు