విజయనగరం టౌన్, వైజాగ్ ఎక్సప్రెస్ జనవర27
ఈరోజు పార్టీ కార్యాలయం అశోక్ గారి బంగ్లాలో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు గారు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఇటీవల దావోస్ పర్యటనలో మన రాష్ట్రానికి మరియు ఉత్తరాంధ్ర ప్రాంతానికి అనేక కంపెనీలు తీసుకురావడానికి కృషి చేసారని, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని అన్నారు. గత వైసిపి దుర్మార్గపు పాలనకు భయపడి రాష్ట్రాన్ని వదిలిపోయిన లులు వంటి కంపెనీలు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ను చూసి తిరిగి మన రాష్ట్రానికి గర్వాంగా ఉందని అన్నారు.
అదేవిధంగా రెండేళ్ల క్రితం ఇదే రోజున శ్రీ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించారని, ఆ యువగళమే ప్రజాబలమై వైసిపి అరాచక పాలనకు చరమగీతం పాడిందని గుర్తు చేసారు. ఇటువంటి మంచి రోజున మన రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలియజేయడం ఆనందంగా ఉందని అన్నారు.
ఈ సందర్బంగా నారా లోకేష్ గారు మొదలుపెట్టిన యువగళం పాదయాత్రం 2 సంవత్సరాgvలు పూర్తిచేసుకున్న సందర్బంగా శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు గారు కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు.