Sidebar


Welcome to Vizag Express
అఖిల భారత్ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభ

27-01-2025 19:20:13

చీపురుపల్లి, వైజాగ్ ఎక్సప్రెస్ న్యూస్ జనవరి 26: అఖిల భారత్ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న పూర్వ విద్యార్థి  నాయకుడు కోట్ల కృష్ణ ప్రపంచంలోనే మొదటి ర్యాంకింగ్లో ఉండి ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం అయినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో జనవరి 24, 25, 26 తేదీల్లో జరిగిన రాష్ట్ర మహాసభలకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో పూర్వ విద్యార్థి నాయకుడైన నన్ను ఈ మహాసభలకు ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ కేంద్ర కార్యాలయానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్టూ, ఈ సంస్థలో పనిచేసే అదృష్టం గతంలో నాకు రావడం వలన నాయకత్వ లక్షణాలను క్రమశిక్షణను భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలతో జాతి ఉన్నతి లక్ష్యాలను మరియు ముఖ్యంగా విద్యార్థుల సమస్యల మీద, విశ్వవిద్యాలయాల సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వాల పనితీరులపై నిరసన తెలుపుతూ ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి ప్రజలకు విద్యార్థులకు సత్వరమే సమస్యలకు పరిష్కారం దొరికే లాగా ఎన్నో ఉద్యమాలు చేసి, విశాఖపట్నం కేంద్రంగా పనిచేయడం జరిగింది. ఈరోజు ఉమ్మడి విజయనగరం జిల్లా కో-ఆర్డినేటర్ గా రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులుగా జనసేన పార్టీలో అత్యంత క్రియాశీలకమైన నాయకుడిగా గుర్తింపు పొందడానికి ప్రధాన కారణం గతంలో నేను పనిచేసిన సంస్థ ద్వారా నేర్చుకున్న క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు దీనికి ప్రధాన కారణమని తెలియజేస్తూ, ఎంతోమంది ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా పనిచేసి ఈ రోజు దేశ రాజకీయ పటంలో కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్య నాయకులు చాలామంది ఉన్నారని వాళ్లని ఆదర్శంగా తీసుకుంటున్నానని,  ఈరోజు యువత ఏ. బి. వి. పి.లో పని చేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు కూడా విద్యార్థుల సమస్యలను తన గలంతో వినిపించి ప్రభుత్వం ద్వారా సత్వరమే పరిష్కారం పొందేలాగా చేసుకుంటూ దేశ ఖ్యాతిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ నాకు ఆహ్వానం పంపిన ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ కార్యాలయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పూర్వ ప్రస్తుత అఖిల భారతీయ విద్యార్థి నాయకులతో కలిసి శోభయాత్రలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను.