విడివికే హబ్ లతో మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలి
కుటుంబాలకు ఆర్థిక ఆసరా గా నిలబడాలి
ఐటీడీఏ పీవో వి. అభిషేక్
చింతపల్లి,వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్, జనవరి 27:
గిరిజన మహిళలు విడివికే హబ్ లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఐటిడిఏ ప్రాజెక్టు వి .అభిషేక్ పేర్కొన్నారు. అన్నవరంలో ఏర్పాటు చేసిన విడివికే హబ్ భవనాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటిడిఏ పరిధిలో 106 విడివికేలు ఉన్నాయని చెప్పారు. పివిటిజి ల కోసం 8, ఇతర గిరిజన సామాజిక వర్గాలకు 98 వీడి వీకె లను ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా కొన్ని విడివికె లను అనుసంధానం చేసి11 వీడీవీకే హబ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ముందుగా అడ్డాకుల తయారీ వి డి వి కే హబ్ ను పాడేరులో ఏర్పాటు చేయడం జరిగిందని అది విజయవంతంగా జరుగుతోందన్నారు. అదే స్ఫూర్తితో 11 మండలాల్లో వీడీవీకేలను ఏర్పాటు చేస్తున్నామని ,గిరిజన మహిళలు విడివికలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ఆర్థిక స్వాలంబన సాధించి కుటుంబాలకు ఆసరాగా నిలవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఎస్ సహాయ ప్రాజెక్టు అధికారులు వీఎస్ ప్రభాకర్ రావు, ఎం వెంకటేశ్వరరావు, డిఆర్డిఏ పిడి వి. మురళి, ఐటిడిఏ పరిపాలన అధికారి ఎం. హేమలత,వెలుగు సిబ్బంది వీడి వీకే సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు