Sidebar


Welcome to Vizag Express
ఆశ్రమ బాలికల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ అరకు ఎమ్మెల్యే మత్స్య లింగం

27-01-2025 19:44:24

ఆశ్రమ బాలికల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ 

అరకు ఎమ్మెల్యే మత్స్య లింగం

ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి,27: విద్యార్థునిలకు ప్రతిభావంతులు గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్య లింగం అన్నారు. మండలంలో గల బంగారుమెట్ట పంచాయతీ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాల లో రికార్డులను పరిశీలన చేశారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు విద్యను బోధించి నాణ్యమైన విద్యను అందించాలని ఆయన ఆదేశించారు. పిల్లలకు తెలుగు ఇంగ్లీషు సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి వారి చదువు సామర్ధ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. చదువులో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి చదువు నేర్పించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని నిర్లక్ష్యం వహించిన ఎడల చర్యలు తప్పవని ఆయన తెలియజేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యమైనవిగా ఉండాలని మెనూ సక్రమంగా అమలు చేస్తూ భోజనం అందించాలని ఆయన వార్దన్ కు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, రాజేశ్వరి, పాఠశాల సిబ్బంది తదితరులు, ఉన్నారు.