Sidebar


Welcome to Vizag Express
జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవ ప్రశంస పత్రం అందుకున్న ఆరోగ్య అధికారిని పి శిరీష

27-01-2025 19:46:17

జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవ ప్రశంస పత్రం అందుకున్న ఆరోగ్య అధికారిని పి శిరీష

ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి,27: 76 గణతంత్ర దినోత్సవం ను పురస్కరించుకొని అల్లూరి జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కార ప్రశంస పత్రం  కిలగాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య వైద్యాధికారిని పి శిరీష అందుకున్నారు. విధి నిర్వనిర్వహణలో అంకిత భావంతో పనిచేసే ఉద్యోగులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని దీనికి నిదర్శనమే ఉత్తమ సేవా పురస్కార అవార్డులు. 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్లూరి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకోవడం చాలా ఆనందకరమని ఆమె అన్నారు. విధి నిర్వహణలో కిలగాడ ప్రాథమిక కేంద్రం ఆరోగ్య అధికారిని శిరీష కు అవార్డు రావడం పట్ల వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. అలాగే మండలంలో ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఎంపీడీవో శ్రీ సాయి హర్ష చేతులమీదుగా సచివాలయ సిబ్బంది, మండల  ఉద్యోగులు 10 మందికి ఉత్తమ సేవ ప్రశంస పత్రాలు అందజేశారు.