Sidebar


Welcome to Vizag Express
అధికారులు, కాంట్రాక్టర్, నిర్లక్ష్యంతో కోట్ల రూపాయలు వృధా త్రాగు నీటి కష్టాలు ఎదుర్కొంటున్న 11 గిరి గ్రామాల ప్రజలు

27-01-2025 19:47:57

అధికారులు, కాంట్రాక్టర్, నిర్లక్ష్యంతో కోట్ల రూపాయలు వృధా

త్రాగు నీటి కష్టాలు ఎదుర్కొంటున్న 11 గిరి గ్రామాల ప్రజలు


ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి,27: మండలంలో సుజన కోట పంచాయితీ కేంద్రంలో  సుమారుగా 11 గ్రామాలకు త్రాగునీటి అందించేందుకు 3 కోట్ల 80 లక్షలతో సమగ్ర రక్షిత మంచినీటి పథకం కు అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ సదరు కాంట్రాక్టర్, అప్పటి సంబంధిత అధికారులు, నిర్లక్ష్యంగా వ్యవహరించి, అసంపూర్తిగా పనులు చేపట్టడంతో గిరిజన ప్రజలకు త్రాగునీరు అందరిని ద్రాక్షగా మిగిలింది. 11 గ్రామాల ప్రజలు పడుతున్న త్రాగునీటి కష్టాలపై స్థానిక సర్పంచ్ వీ రమేష్, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం దృష్టికి తీసుకు వెళ్లడంతో సర్వసభ్య సమావేశానికి హాజరైన  ఎమ్మెల్యే సభ అనంతరం సుజన కోట పంచాయతీ కేంద్రంలో పర్యటన చేసి అసంపూర్తిగా నిలిచిన త్రాగునీటి పథకాల వాటర్ ట్యాంక్ పైపులైన్లను క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ప్రభుత్వం కేటాయించిన నిధులు వృధా అవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. త్రాగునీటి నిర్మాణ పనులు పూర్తిస్థాయిగా జరిగి ఉంటే సుమారు 11 గ్రామాల గిరిజన ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కలిగి ఉండేదని ఆయన అన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి త్రాగునీటి సమస్యను పూర్తిగా వివరించి సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. అలాగే మండల కేంద్రంలో గత మూడు వారాలుగా పైపులైన్ల ద్వారా నీరు అందించని ఆ శాఖ సిబ్బంది సర్వసభ్య సమావేశంలో అరకు ఎమ్మెల్యే వస్తున్నారని తెలుసుకొని మండల కేంద్రంలో మంచినీరు సరఫరా చేశారని పలువురు మహిళలు మండలంలో బాహ్యటంగ మాట్లాడుతున్నారు.