మండల స్థాయి సర్వసభ్య సమావేశం.
27-01-2025 19:49:47
మండల స్థాయి సర్వసభ్య సమావేశం.
ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి,27: మండల కేంద్రం ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరం ఎంపీపీ అరిసెల సీతమ్మ అధ్యక్షతన సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు అరకు శాసనసభ్యులు, రేగం మత్స్యలింగం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ.. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని, మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. గ్రామాలలో రహదారి సౌకర్యం, వ్యవసాయం, జలజీవన్ మిషన్ ద్వారా జరుగుతున్న పనులను, పీఎం జన్ మన్ గృహాలు నిర్మాణాలపై, మంచినీటి సమస్యల కల్పనకు అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రెవెన్యూ అధికారులు భూ సమస్యలను పరిష్కరించాలన్నారు. గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్య పరిష్కారం కావడానికి సర్వసభ్య సమావేశం మంచి వేదిక అని, ప్రజా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపీడీవో శ్రీ సాయి హర్ష మాట్లాడుతూ.. మండల స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులు నివేదిక సమర్పించారని, ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సర్వసభ్య సమావేశంలో తహసిల్దార్, ఎస్ ఎం ఐ ఏఈ, కాఫీ ప్రాజెక్ట్ వారు హాజరు కాకపోవడంతో ఎమ్మెల్యే, ఎంపీడీవో అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరుకాని అధికారులకు శాఖపరమైన నోటీసులు జారీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సత్యనారాయణ, భాగ్యవతి, వివిధ పంచాయతీల, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.