Sidebar


Welcome to Vizag Express
సీఎం చంద్రబాబుకు వివాహ శుభ పత్రిక అందించిన నల్లమిల్లి

27-01-2025 19:51:27

సీఎం చంద్రబాబుకు వివాహ శుభ పత్రిక అందించిన నల్లమిల్లి 

అనపర్తి, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 27 : వచ్చే నెల 8 న హైదరాబాద్ జూబ్లీహిల్స్ జె ఆర్ సి కన్వెన్షన్ విష్పార్ వ్యాలీలో అతిరథ మహారధుల రాక మధ్య అత్యంత వైభవంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతుల కుమారుడు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి సుమేఘరెడ్డి వివాహాం జరుగనుంది.ఈ సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు, కుమారుడు, కుమార్తె నల్లమిల్లి మనోజ్ రెడ్డి, డాక్టర్ నల్లమిల్లి సనాతని, తల్లి సత్యవతి ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసంలో నారా చంద్రబాబు నాయుడుని వివాహానికి ఆహ్వానిస్తూ వివాహ శుభలేఖ అందజేశారు.