ఎన్నారై ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స
7 కేజీల కణితి తొలగింపు
భీమిలి వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్ జనవరి 27:
భీమిలి జీవీఎంసీ రెండవ వార్డు సంగివలస ఎన్నారై ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి 7 కేజీల కణితి తొలగించారు.ఆంధ్ర- ఒడిస్సా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతమైన మల్కాన్ గిరి ప్రాంతంలో వైద్యశిబిరం నిర్వహించే సందర్భంలో మార్తాన్.ధనాయి (33) అనే మహిళ మూత్ర వ్యాధితో శిబిరానికి వచ్చింది. ఈమెను తగరపువలస ఎన్నారై ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.ఈ నేపథ్యంలో మూత్రాశయంలో సుమారు 7 కేజీల కణితి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు దీనివలననే మూత్రశయ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించారు.డాక్టర్.ప్రదీప్ మనోహర్ పర్యవేక్షణలో ఆరుగురు వైద్యుల బృందం మూడు గంటల శ్రమించి రోగి శరీరంలో ఉన్న 7 కేజీల కణితిని తొలగించారు.ఈ సందర్భంగా
ఎన్నారై డిన్.పివి.సుధాకర్ మాట్లాడుతూ...ఈ తరహా శస్త్ర చికిత్స అరుదైనదని పేర్కొన్నారు.ఈ చికిత్సను విజయవంతం చేసిన వైద్యుల బృందాన్ని అభినందించారు. గ్రామీణ రోగులకు ఆరోగ్య భరోసాగా ఎన్నారై ఆసుపత్రి సేవలందిస్తోందని తెలిపారు. ఇటువంటి వ్యాధులు తరచూ గిరిజన ప్రాంతాలలోనే ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు.వీటి బారి నుండి బయటపడాలంటే ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై వైద్యులు తదితరులు పాల్గొన్నారు.