రిటైర్డ్ లెక్చరర్ వాకా పేరిరెడ్డి చిత్రపటానికి నివాళులు
27-01-2025 19:58:17
రిటైర్డ్ లెక్చరర్ వాకా పేరిరెడ్డి చిత్రపటానికి నివాళులు
అనపర్తి, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 27: అనపర్తి జిబిఆర్ డిగ్రీ కళాశాలలో కామర్స్ అధ్యాపకునిగా విశేషమైన సేవలందించి 2008లో పదవీ విరమణ పొందిన వాకా పేరిరెడ్డి(75) బెంగళూరులో గుండెపోటుతో ఈనెల 24న ఆకస్మికంగా మృతి చెందారు. ఆయనకు భార్య కరుణ, కుమారుడు కోడలు కృష్ణ చైతన్య మైథిలి, కుమార్తె అల్లుడు శిల్ప విజయ్ కుమార్ ఉండగా వీరు బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. సోమవారం జిబిఆర్ కళాశాల ఆవరణలో పేరిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ తేతలి ఆదిరెడ్డి(కొండబాబు), గొలుగూరి రామారెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్స్ బి రత్నారెడ్డి, గొలుగూరి జగన్నాథరెడ్డి, ఎస్ వి గంగరాజు, మల్లిడి ఉమా వెంకటరెడ్డి, మల్లిడి రామారెడ్డి, డిగ్రీ, ఇంటర్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎన్ పెద్ద అబ్బాయి రెడ్డి, పి.ఆర్.ఎల్ స్వామి తదితరులు ఉన్నారు