Sidebar


Welcome to Vizag Express
వాసవి క్లబ్...ఎంవిపి కపుల్స్ అధ్యక్షుడు గా వెంకట రామకృష్ణారావు..

27-01-2025 20:16:45

వాసవి క్లబ్...ఎంవిపి కపుల్స్ అధ్యక్షుడు గా వెంకట రామకృష్ణారావు..
 మధురవాడ వైజాగ్ ఎక్స్ప్రెస్ :
వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ 2025 సంవత్సరానికి ప్రెసిడెంటు, సెక్రెటరీ, ట్రెజరర్ల, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం 
సెక్టార్ 6, భద్రం పార్క్ లో గల  ఆడిటోరియంలో వైభవంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కార్పొరేట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రెసిడెంట్ వాసవియన్ గోల్డెన్ స్టార్ కేసిజిఎఫ్ కె.విశ్వనాథ్ గుప్తా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా వి 201 ఏ గవర్నర్ వాసవియన్ గోల్డెన్ స్టార్ కేసిజిఎఫ్ శ్రేయోభిలాషి తమ్మన అమర్నాథ్ గారు నూతన కార్యవర్గ సభ్యులు అయిన అధ్యక్షులుగా వాసవియన్ వెంకట రామకృష్ణారావు అనంతపల్లి, కార్యదర్శిగా వాసవియన్ 
కాపుగంటి వెంకటరమణమూర్తి , కోశాధికారిగా వాసవియన్ కాపుగంటి చంద్రశేఖర గుప్త లచే ప్రమాణ స్వీకారం చేయించినారు. ఈ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ హానర్స్ గా క్యాబినెట్ సెక్రటరీ వాసవియన్ గోల్డెన్ స్టార్ కెసిజిఎఫ్ వంకాయల నిర్మల గారు, క్యాబినెట్ ట్రెజరర్ వాసవియన్ సిల్వర్ స్టార్ కేసీజిఎఫ్ చెరుకు కృష్ణ గారు, వైస్ గవర్నర్ వాసవియన్ గోల్డెన్ స్టార్ కపుల్ కేసిజియఫ్ శ్రేయోభిలాషి 
పుల వర్తి రమేష్ గారు, రీజన్ చైర్ పర్సన్  వాసవియన్ సిల్వర్ స్టార్ కెసిజిఎఫ్ ఆదిమూలం తిరుపతిరావు, రీజన్ సెక్రెటరీ వాసవిఎన్ 
కేసిజిఎఫ్ పాలిశెట్టి పుష్పలత,, జోన్ చైర్ పర్సన్  వాసవిఎన్ 
కేసిజిఎఫ్ గోగుల కమల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 నూతన కార్యవర్గం ఏర్పాటు సందర్భంగా సేవా కార్యక్రమం లో భాగంగా ఇద్దరు మహిళలకు కుట్టు మిషన్లు, ఒక పేద కుటుంబీకులకు వ్యాపారము  చేయి నిమిత్తము 20 వేల రూపాయలు, ఒక మెరిట్ స్టూడెంట్ కు 5వేల రూపాయలు స్కాలర్షిప్ గా అందజేశారు.