Sidebar


Welcome to Vizag Express
మద్యం షాపును వ్యతిరేకించిన గ్రామ ప్రజలు

27-01-2025 20:23:38

మద్యం షాపును వ్యతిరేకించిన గ్రామ ప్రజలు

అంబాజీపేట, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 26:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలం మాచవరం పంచాయతీ పరిధిలో సోమవారం  వెంకటేశ్వర్ కాలనీ వద్ద గీత కార్మికులు మద్యం షాప్ ఏర్పాటు చేసే ప్రయత్నానికి స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. అంబేద్కర్ విగ్రహం ఎదురుగా మద్యం షాప్ ఏర్పాటు అంబేద్కర్ అవమానం భావిస్తున్నామని, అంగన్వాడి, పాఠశాల, రామాలయం గుడి, కాలనీకి దగ్గరగా మద్యం షాప్ నిర్మిస్తున్నారని ఆందోళన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రదేశంలో మద్యం షాపు నిర్వహించరాదని, స్థలం  యజమానికి అంబటి కోటేశ్వరరావు కు తెలియజేశారు.