Sidebar


Welcome to Vizag Express
శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యార్థులకు కబడ్డీ, వాలీబాల్ పోటీలు

27-01-2025 20:25:32

శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యార్థులకు కబడ్డీ, వాలీబాల్ పోటీలు 


భీమునిపట్నం వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్ జనవరి 27;ఫిబ్రవరి  ఒకటి , రెండవ తేదిలలో జరగనున్న భీమిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా భీమిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నిర్వహించ తలపెట్టిన ఆటల పోటీలను సోమవారం శతాబ్ది ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు కలిగొట్ల సూర్యనారాయణ మూర్తి ప్రారంభించారు. భీమిలి సెయింట్ ఆన్స్ స్కూల్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలిగొట్ల సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థులందరూ చక్కని పోరాట స్ఫూర్తిని చూపించాలని చెప్పారు. పాఠశాల పూర్వ విద్యార్థినీ విద్యార్థులందరూ ఈ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనాలని కోరారు. ఈ క్రీడల్లో భాగంగా మధ్యాహ్నం కబడ్డీ పోటీలను స్థానిక సన్ స్కూల్ డైరెక్టర్ కైతపల్లి శ్రీనివాస్ మరియు జిల్లా ఉప విద్యాశాఖాధికారి, శతాబ్ది ఉత్సవ నోడల్ అధికారి ఎ. సోమేశ్వరరావుతో కలసి ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో శతాబ్ది ఉత్సవ కమిటీ కార్యదర్శి మైలపల్లి లక్ష్మణరావు, కోశాధికారి పూసర్ల శ్రీనివాసరావు, టి భీమారావు, మైలపల్లి షణ్ముఖరావు, గంటా నూకరాజు, కాళ్ళ సన్నీ, అత్తిలి సత్యనారాయణ, కంటుభుక్త ముత్యాలరావు, దారపు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.