కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ చొరవతో స్మశాన వాటిక బోర్ వెల్ మరమ్మత్
ఆనందపురం, వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్ జనవరి 27
మండలంలోని వేములవలస లో గల స్మశాన వాటికను స్థానిక పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ చొరవతో పరిశుభ్రం చేశారు. స్మశాన వాటికకు వెళ్లే రహదారిలో పిచ్చి పిచ్చి మొక్కలు పెరిగి వచ్చేవారు నడవడానికి ఇబ్బందిగా ఉండేది. అంతేకాకుండా అంతిమ సంస్కారాలు చేసేందుకు కూడా చాలా కష్టం అయ్యేది. ఇక్కడ గల మంచినీటి బోరు పాడవడంతో వచ్చేవారు తీవ్ర అవస్థలు పడేవారు. ఈ విషయం కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ దృష్టికి రావడంతో తక్షణమే స్పందించి పారిశుద్ధ్య సిబ్బందితో పిచ్చి మొక్కలు తొలగించడమే గాకుండా దగ్గరుండి మంచినీటి బోరు కు మరమ్మతులు జరిపించి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా ఇటీవల పడిన వర్షాలకు రోడ్డుమీద పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రం చేయించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా ఇందుకు సహకరించిన పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, బోరు మరమ్మతులు చేపట్టిన సత్తిబాబు, పారిశుధ్య సిబ్బందికి కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ధన్యవాదాలు తెలియజేశారు.