Sidebar


Welcome to Vizag Express
ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అన్ని రంగాల్లో స్థిర స్థాయిగా నిలిపిన మార్క్

27-01-2025 20:30:25

ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అన్ని రంగాల్లో స్థిర స్థాయిగా నిలిపిన మార్క్

మాజీ ఉప ముఖ్యమంత్రి బూడికి బోయిల కింతాడ ప్రజలు కృతజ్ఞతలు వెల్లువ

దేవరాపల్లి, వైజాగ్ ఎక్స ప్రెస్, జనవరి 27:
 మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం బోయిల కింతాడ గ్రామంలో దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు గ్రామ సర్పంచ్ శ్రీ బూరె బాబురావు  దేవరాపల్లి మండల గ్రామీణ మంచి నీటి సరఫరా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ చంద్రశేఖర్ విచ్చేసి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్ శాఖా,గ్రామీణా మంచినీటి సరఫరా మంత్రి వర్యులు శ్రీ బూడి ముత్యాలనాయుడు  నాయకత్వంలో ప్రజల వినతి మేరకు ముత్యాలనాయుడు గారు బోయిలకింతాడ మరియు శివారు గ్రామం బి.కొత్తూరు గ్రామాల్లో జలజీవన్ మీషన్ పధకం కింద ఇంటిఇంటికి కోలాయి ఏర్పాటు నిమిత్తం సుమారు ఒక కోటి ఎనబై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది బోయిలకింతాడ గ్రామంలో వెను వెంటనే పనులు చేపట్టి అరవై వేలలీటర్ల సామర్థ్యంతో నూతన మంచినీటి ట్యాంక్ నిర్మాణం పూర్తి చేసి ఇంటి ఇంటికి నూతన కొళాయి అందిచడం జరిగింది ఈ రోజు బోయిలకింతాడ శివారు కొత్తూరు లో నూతన మంచినీటి ట్యాంక్ నిర్మాణం కోరకు కొలతలు చేపట్టి వెంటనే పనులు చేపట్టుటకు అదేశాలు జారీ చేసి బోయిలకింతాడ గ్రామంలో గతంలో కొళాయిల కోరకు పూడిక తీసిన సిసి రోడ్డులు మరమ్మత్తులు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అందించాలి అనే దృఢ సంకల్పంతో చేపట్టిన పనులు సంభంధిత కాంట్రాక్టర్ను వెంట పెట్టుకొని పనులును వీధి వీధుల్లో పర్యవేక్షణ చేయడం జరిగింది ఈ సందర్బంగా ప్రజల అందరూ ఆనందం వ్యక్తం చేస్తూ మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది 

ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్రీ కోమార బాబురావు ,శ్రీ కోన సత్యం (ధర్మశ్రీ),శ్రీ బొబ్బిలి పెదఅప్పారావు  సచివాలయం ఇంజనీరింగ్ అధికారి శ్రీమతి రామ లక్ష్మి కాంట్రాక్టర్ లు శ్రీ మహేష్ , శ్రీ సూర్యనారాయణ గారుతదితరులు పాల్గొన్నారు