Sidebar


Welcome to Vizag Express
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలి

27-01-2025 20:36:31

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలి: నర్సీపట్నం,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 27: 
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి, సమన్వయంతో పని చేయాలని, ఆర్డీవో వివి. రమణ అధికారులను ఆదేశించారు. ఆర్డిఓ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల వద్ద నుండి వివిధ రకాల ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో అధికారులతో మాట్లాడుతూ, ప్రజల సమస్యలు సకాలంలో  పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ఆర్జీలను వేగవంతంగా పరిష్కరించి సంబంధిత సమాచారాన్ని దరఖాస్తుదారులకు తెలియజేయాలన్నారు. గతంలో దరఖాస్తులు ఇచ్చినవారు మరలా దరఖాస్తులు ఇవ్వకుండా అవగాహన తీసుకురావాలన్నారు. ఆర్డీవో స్పందనకు 18 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. వివిధ భూ సంబంధిత సమస్యలు, రెవెన్యూ, మున్సిపల్ సమస్యలు పరిష్కారం కొరకు  ప్రజలు దరఖాస్తులు అందజేశారు.