Sidebar


Welcome to Vizag Express
ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కు ఘనసన్మానం

27-01-2025 20:38:04

ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కు ఘనసన్మానం:
నర్సీపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి 27:  రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎన్.ఎస్. కృష్ణ అనకాపల్లి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా డిగ్రీకళాశాల సిబ్బంది సోమవారం ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, మెరిట్ సర్టిఫికెట్ రావడానికి విశేషకృషి చేసిన ప్రిన్సిపాల్ డాక్టర్ రాజుకు ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పెరిగే విధంగా అవార్డు మరింత బాధ్యతను పెంచిందని ఆయన పేర్కొన్నారు. తన ఉన్నతికి కారణమైన గురువులను, తల్లిదండ్రులను వైస్ ప్రిన్సిపాల్ స్మరించుకున్నారు. తోటి అధ్యాపక సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.