స్పీకర్ సతీమణి పద్మావతి,తనయుడు రాజేష్ చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ పంపిణి: నర్సీపట్నం,వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి 27:
స్పీకర్ అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి, మునిసిపల్ వార్డ్ కౌన్సిలర్ రాజేష్ చేతుల మీదుగా సోమవారం పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను నియోజవర్గంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు అందజేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల కోసం ఈమెటీరియల్ తయారు చేయబడింది.
ఈ స్టడీ మెటీరియల్ అల్లాడ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు అల్లాడ సురేష్ కుమార్ ఆర్థిక సహాయంతో అందించబడింది. విద్యార్థుల కోసం ఎస్ సి ఈ ఆర్ టి వారు రూపొందించిన ప్రశ్నలు సమాధానాలతో పాటు, అదనంగా ఉత్తమ ఫలితాలకు కావలసిన మెటీరియల్ సమర్పించబడింది. ఈ మెటీరియల్ అనంతపురం జిల్లా బయాలజీ ఉపాధ్యాయుడు శేషగిరి ప్రసాద్ తయారు చేసారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి పరీక్షల సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధన కోసం స్టడీ మెటీరియల్ అందజేసిన అల్లాడ చారిటబుల్ ట్రస్ట్ కు ఉపాధ్యాయులు హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేశారు. భవిష్యత్ తరాల విజయానికి ఈ స్టడీ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయుల కొనియాడారు.