Sidebar


Welcome to Vizag Express
విద్యార్థులకు జిరాక్స్ కాపీలైనా ఇప్పించండి

27-01-2025 20:41:18

విద్యార్థులకు జిరాక్స్ కాపీలైనా ఇప్పించండి
       ఎచ్చెర్ల, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 27:

చదువులు పూర్తి అయినా, కొలువులుకు దరఖాస్తు కూడా చేయలేని దయనీయ పరిస్థితి వాళ్ళది. రెక్కాడితే గాని డొక్కాడని తల్లితండ్రులు అప్పుచేసి వారి ధ్రువీకరణ పత్రాలుకి డబ్బులు ఇచ్చి ఎలా తీసుకెళ్లగలరు.ప్రభుత్వాలు ఇచ్చే ఫీజు రీయంబర్స్మెంట్ తోనే చదువులు పూర్తి చేసే పేద విద్యార్థులు ఈ జిల్లాలో డిప్లొమా, ఇంజనీరింగ్,డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు వేలల్లోనే వున్నారు.ఈ నేపథ్యంలో కనీసం జిరాక్సు కాపీలైనా ఇప్పించాలని కోరుతూ స్ధానిక ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ను కోరుతూ ఫూలే టీచర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు బొడ్డేపల్లి భూపతి రావు సోమవారం వినతిపత్రాన్ని సమర్పించారు. ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేయటానికి కూడా మాకు కాలేజీ యాజమాన్యాలు ధ్రువీకారణ పత్రాలు ఇవ్వడం లేదని, కనీసం జిరాక్స్ కాపీలైన ఇవ్వండి. ఒరిజినల్స్ మీ దగ్గరే ఉంచుకోండి. ప్రభుత్వం ఎప్పుడు రియంబర్స్ చేస్తే అప్పుడే ఇవ్వండి అన్నా కుదరదు పొమ్మని కాలేజీ యాజమాన్యాలు నిర్మొహమాటంగా చెబుతున్నారంటే వారికి పెదవిద్యార్థుల భవిష్యత్తు పై ఎంత శ్రద్ధ ఉందో తెలుసుకోవచ్చు. ఎచ్చెర్ల ఐఐటీ లో 2023-24 బ్యాచ్ విద్యార్థులు రిలీవ్ అయ్యి దగ్గర 7,8 నెలలు గడుస్తున్నా అక్కడ విద్యార్థులకు ఇప్పటికీ ధ్రువపత్రాలు అందించలేదు. వారంతా పదవతరగతి లో అత్యున్నత ప్రతిభ చూపి అక్కడ ఇంజనీరింగ్ లు పూర్తి చేసిన, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే సామర్ధ్యం వున్నా వారు ఏ కొలువుకు అప్లై చేయలేని పరిస్థితి. ఆ కాలేజీ కి  విద్యార్థులు వెళ్లి కనీసం మాకు జిరాక్స్ కాపీలైన ఇవ్వండి సార్ అనిన నిర్మొహమాటంగా కుదరదు, డబ్బులు కట్టి ఒరిజినల్స్ తీసుకెళ్లండి అని ఖరఖండీగా చెప్పి విద్యార్థుల అవకాశాలను గండికొడుతున్నారు. ఈ విషయం లో జిల్లా కలెక్టర్ గారు చొరవ చూపి, విద్యార్థులకు ఉద్యోగాలకు అప్లై చేసుకొనుటకు జిరాక్స్ కాపీలైన ఇమ్మని ఆదేశిస్తే పేదవిద్యార్థులకు న్యాయం జరుగుతుంది.