కొర్లాం సుధీష్ణకు ధమాకా దర్శకుడు సన్మానం
27-01-2025 20:48:56
కొర్లాం సుధీష్ణకు ధమాకా దర్శకుడు సన్మానం
సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 27:
ప్రఖ్యాత కూచిపూడి , జానపద నృత్య కళాకారిణి ,రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు గ్రహీత సోంపేట మండలం కొర్లాం గొనకపాడు హైస్కూల్ లో 9వ తరగతి చదువుతున్న మాల్యాడ సుదీష్ణ కు నేను లోకల్ ,హలో గురూ ప్రేమ కోసమేరా , సినిమా చూపిస్తా మామ , ధమాకా వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలు దర్శకుడు నక్కిన త్రినాథరావు చేతుల మీదుగా సన్మానం పొందింది .అనకాపల్లిలో దేవాంగ వధూవరుల పరిచయ వేదిక సందర్భంగా సుధీష్ట ప్రదర్శించిన నృత్యానికి అక్కడ ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.ఈ నృత్యాన్ని తిలకించిన దర్శకుడు ఆకర్షితుడై సన్మానం చేశారు.సినీ దర్శకుడు చేతులు మీదుగా సన్మానం పొందడం తనకెంతో ఆనందంగా ఉందని , ఇటువంటి సంధర్భం రావడం అదృష్టం గా బావిస్తున్నానని సుధీష్ట సంతోషం వ్యక్తం చేసింది .సుధీష్ట ప్రతిభకు సన్మానం అని కొర్లాం సర్పంచ్ ప్రతినిధి ,జాగృతి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రాంబుడ్డి గణపతి ,పాఠశాల సిబ్బంది అభినందించారు