ఎపి బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబు ముందుచూపుతోనే !
పెట్టుబడులు ఘనత లోకేష్ దే !
ఎమ్మెల్యే శిరీషా!
సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ప్రెస్ ,జనవరి 27:
సీఎం చంద్రబాబు కృషితో వరల్డ్ ఎకనామిక్ ఫారం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జగన్ రెడ్డి
నిర్వాకానికి అంధకారంలోకి వెళ్ళిన పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావడం కోసం సి.యం చంద్రబాబునాయుడు
మంత్రి నారా లోకేష్ ,డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ ల కృషేనని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషా అన్నారు. నాడు తెలుగు ప్రజలకు
మొదటిసారి ఐటీని పరిచయం చేసి తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. నేడు మరో మరో ప్రతిష్ఠాత్మకమైన అడుగు
పడింది. ఏఐ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచ దిగ్గజాలతో భేటీ అయ్యారు. చంద్రబాబు గారు రాష్ట్రం కోసమే కాకుండా
యావత్ దేశం తరపునే దావోస్లో నాయకత్వం వహించారు. ప్రపంచంలోనే అత్యంత తలసరి ఆదాయం గల దేశాల్లో మన దేశాన్ని
అగ్రగామిగా నిలపాలని పిలుపునివ్వడంతో పాటు తెలుగువాడి ప్రతిభను మరోసారి పరిచయం చేసేందుకు కంకణం కట్టుకున్నారు.
20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంగా రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం తీసుకురావడానికి దావోస్ నడి వీధుల్లో సీఎం చంద్రబాబు,
ఐటీ మంత్రి నారా లోకేష్ శ్రమ సత్ఫలితాలనిస్తున్నాయి. వెళ్ళిన ప్రతి చోట రెడ్ కార్పెట్ వేసి చంద్రబాబు గారు, లోకేష్ గారికి
పారిశ్రామికవేత్తలు స్వాగతం పలికారు. రాష్ట్రంలో ఉన్న అపార వనరులు, మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ పాలసీల గురించి
పారిశ్రామికవేత్తలకు వివరించి పెట్టుబడులు పెట్టేందుకు అంధ్రప్రదేశ్ అనువైన రాష్ట్రమని ఆహ్వానించారు. గత ప్రభుత్వంలో జగన్
రెడ్డి చేతకాని ప్రభుత్వంలా దావోస్ వెళ్ళకుండా ఇంట్లో సమయాన్ని వృదా చేసారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, టాటా చైర్మన్
చంద్రశేఖరన్ వంటి ప్రపంచ దిగ్గజాలు సీఎం చంద్రబాబు గారి విజన్ పై నమ్మకంతో, రాష్ట్రంలో పెట్టుబడి పెడతానని హామీ
ఇవ్వడం చంద్రబాబు విజన్ 2047 విజయాన్ని సూచిస్తోంది. గతంలో చంద్రబాబు కృషితో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు, సాఫ్టువేర్
కంపెనీలను, లక్షల కోట్ల పెట్టుబడులను జగన్ రెడ్డి తరిమేశాడు. జే ట్యాక్స్ పారిశ్రామికవేత్తలను బెంబేలెత్తించి పారిశ్రామికాభివృద్ధిని
గాలికి వదిలేశాడు. కేసుల నుంచి విముక్తి పొందేందుకు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టేందుకు, విశాఖ ఉక్కును అమ్మేందుకు జగన్ రెడ్డి
ప్రయత్నించాడు. 2019లో వైసీపీ వచ్చాక 'బ్రాండ్ ఏపీ'గా ఉన్న మన రాష్ట్రాన్ని 'బిల్డప్ ఏపీ'గా జగన్ రెడ్డి మారిస్తే తిరిగి సన్ రైజ్
ఏపీగా నేడు చంద్రబాబు మార్చటానికి కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులుతో
సుమారు 50 కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. ఇప్పటికే అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు మొదలుపెట్టాయి, యువతకు 40 వేల
మందికి ఉద్యోగావకాశాలు లభించాయి.
జగన్ రెడ్డి విద్వంసక పాలనపై యుద్ధం ప్రకటించిన యువనాయకులు శ్రీ నారా లోకేష్ గారు రెండు సంవత్సరాల
క్రితం ప్రజల మరియు రాష్ట్ర పరిస్థితిలు తెలుసుకోవడానికి ప్రజలకు అండగా కార్యాకర్తల్లో ఉత్తేజం నింపడానికి యువగళం పేరుతో
97 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టి వాస్తవికతను తెలుసుకోని తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మంత్రివర్యులు
శ్రీ నారా లోకేష్ గారు అభివృద్ధికి అడుగులు వేసారు. యువగళం అడుగు పడి నేటికి రెండు సంవత్సరాలు సందర్భంగా శు
భాభినందనలు. మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి కృషితో ఒక్క జూమ్ కాల్తోనే ఆర్సెలార్ మిట్టల్ మరియు నిప్పాన్ స్టీల్
కంపెనీతో మాట్లాడి రాష్ట్రానికి 1.46 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చిన ఘనత నారా లోకేష్ గారిది. జనవరి 8న విశాఖలో
రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోది శంకుస్థాపన చేశారు. టీసీఎస్, బీపీసీఎల్, రిలైన్స్, గ్రీన్కో, ఆర్సెలార్ మిట్టల్ మరియు
నిప్పాన్ స్టీల్, పీపుల్ టెక్ వంటి ఎన్నో పరిశ్రమలు ఇప్పటికే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతున్నాయి. విద్యాశాఖలో ఉన్నతమైన
సంస్కరణలు తీసుకురావడానికి కృషి చేసారని వివరించారు.