Sidebar


Welcome to Vizag Express
గతంలో అనుభవించాం ఇప్పుడు అనుభవిస్తున్నాం! ఎమ్మెల్యే అశోక్

27-01-2025 20:58:26

గతంలో అనుభవించాం ఇప్పుడు అనుభవిస్తున్నాం!

ఎమ్మెల్యే అశోక్

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 27:

 గత ప్రభుత్వంలో ప్రజలు అనేక రకమైన కష్టాలు అనుభవించారని ఆ అనుభవాలన్నీ చవిచూసిన తర్వాత అటువంటి పాలకులు రాష్ట్రానికి అవసరం లేదని రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో చెప్పారని ఇప్పుడు మంచి పరిపాలన అధ్యక్షుడు, అనుభవజ్ఞుడు దేశంలోని గొప్ప రాజకీయ మేధావైన చంద్రబాబు నాయుడు సంక్షేమ పాలనలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి పాలనను అనుభవిస్తున్నారని ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాలం అశోక్ అన్నారు. సోమవారం కుసుపురంలో సోమవారం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో సిసి రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి అక్కడ జరిగిన సభలో మాట్లాడారు. మూడుసార్లు గెలిచానన్న హ్యాట్రిక్ర్  సాధించాననే  ఆనందం కన్నా యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ దాసరి రాజు, బిజెపి ఇచ్చాపురం ఇన్చార్జి నిర్మలారెడ్డిలతో కలిసి ప్రయాణం చేయడం తనకంటూ ఆనందాన్ని అనుభూతిని ఇచ్చిందని ఈ సందర్భంగా ప్రజల హర్షధ్వానాలు మధ్య ప్రకటించారు. దాసరి రాజు నిర్మలారెడ్డి ఇద్దరు తనతో సమాంతరంగా పనిచేసే తన విజయానికి ఐహర్నిశను కృషి చేయడం వల్లే గత రెండు ఎన్నికల కన్నా మించి మెజార్టీ సాధించానని పేర్కొన్నారు. ప్రజలకు ఎటువంటి రవాణా కష్టాలు ఉండకూడదనే లక్ష్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటిదాకా సుమారు 4000 కి.మీరా సిసి రోడ్లు వేయించి దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించారని కొనియాడారు .రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలనే తపన ఉన్న చంద్రబాబు, ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉన్న పవన్ కళ్యాణ్ ఇద్దరికీ మంచి చేయాలనే ఆలోచన ఉండటంవల్ల కేవలం ఎనిమిది నెలలు రాష్ట్రం అని రంగాల్లో ప్రగతి పధంలో నడుస్తుందని అన్నారు .ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం ,కవిటి ,కంచిలి సోంపేట మండలాల చెందిన కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు