పాతపట్నం నియోజకవర్గం కేంద్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే ఎంజిఆర్..
పాతపట్నం ,వైజాగ్ ఎక్స్ప్రెస్- జనవరి 27 .
ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది.ఈ నాలుగు రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈవోలు-అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు,సదస్సుల్లో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను కార్పొరేట్ దిగ్గజాల్లో బలంగా నాటారు.అని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు.ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో ప్రపంచ ఆర్ధిక సదస్సు వేదికగా ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తెలియజేశారు. రాష్ట్రంలోని వనరులతో పాటు నైపుణ్యం కలిగిన మానవవనరులు, పౌరసేవల్లో టెక్నాలజీ వినియోగం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తదితర అంశాలను సీఎం బృందం కార్పొరేట్ దిగ్గజాలముందుంచింది. అని తెలియజేశారు.ప్రపంచం దేశాల నుంచి దావోస్‌కు వచ్చిన పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో చంద్రబాబు సంపూర్ణంగా సఫలమయ్యారు అని అన్నారు .