పశువైద్య శిబిరానికి విశేష స్పందన
తెర్లాం వైజాగ్ ఎక్సప్రెస్ న్యూస్ జనవరి 28:-తెర్లాం మండలం లో వెలగవలస,లోచర్ల గ్రామాలలో మంగళవారం డాక్టర్ జె నరేంద్ర కుమార్,డాక్టర్ ఇ.అరుణ ఆధ్వర్యంలో పశుఆరోగ్య శిబిరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 455 సాధారణ చికిత్సలు,63 పశువులకు గర్భకోశవ్యాధి చికిత్సలు 10 పశువులకు కృత్రిమ గర్భధారణ, 48 పశువులకు చూడి తనిఖీలు చేశారు.దూడలకు గొర్రెలకు నట్టల నివారణ మందులు,కోళ్లకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమం ద్వారా 223 మంది పాడి రైతులకు లబ్ధి చేకూరినది ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు చేపేన పాల్గుణ రావు, గర్భాపు దాలమ్మ , వైస్ ఎంపీపీ చేపేన సత్యనారాయణ నాయకులు మర్రాపు జగన్నాధం నాయుడు, మర్రాపు యుగంధర్, రెడ్డి శంకర్ తదితరులు గ్రామ పెద్దలు రైతులు పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.