Sidebar


Welcome to Vizag Express
విశాఖ ప్రాంతీయ ఇన్వెస్టర్లు పాల్గొన్న నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి.

28-01-2025 18:26:39

విశాఖ ప్రాంతీయ ఇన్వెస్టర్లు పాల్గొన్న నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి.
నెల్లిమర్ల :జనవరి 28


విశాఖపట్నం ప్రాంతంలో పర్యాటక రంగ భవిష్యత్‌ను తెరచడం అనే థీమ్‌తో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో, పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారి నేతృత్వంలో జరిగిన “విశాఖ ప్రాంతీయ ఇన్వెస్టర్ల సమావేశం”లో నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి  పాల్గొన్నారు. ఈ సమావేశంలో విశాఖ ప్రాంత పర్యాటక అభివృద్ధి కోసం వివిధ రంగాల పెట్టుబడిదారుల సహకారం మీద చర్చలు జరగగా, లోకం నాగ మాధవి గారు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం ద్వారా ఈ ప్రాంత పర్యాటకాభివృద్ధికి తాము ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామని తెలియజేశారు. ఈ సమావేశం ప్రాంతీయ పర్యాటక రంగాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లే దిశగా మంచి మార్గదర్శకాన్ని అందించింది.