పలు గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం
రేగిడి జనవరి 28 వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్
రేగిడి ఆమదాలవలస మండలం దేవుదల, పుర్లి, సంకిలి,అప్పాపురం ,గ్రామాల వ్యవసాయ శాఖ అధికారి
జి. మురళీకృష్ణ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు, పెస, మినుము, మొక్కజొన్న పంటలు యాజమాన్య పద్ధతులు గురించి వివరించారు. అలాగే ప్రధాన మంత్రి కిసాన్ సమాన్ నిధి కోసం రైతులు ఈ కే వై జి చేసుకోవాలి . పొలానికి నీటి సరఫరా కోసం నీటి పైపులు రిజిస్ట్రేషన్లజరుగుతున్నాయని రైతు పండించే పంటకు మద్దతు ధర ఉంది కాబట్టి రైతుల ధాన్యాన్ని మిల్లులకు ఈ నెల ఆఖరి లోపల పంపించాలని అన్నారు.