Sidebar


Welcome to Vizag Express
త్రాగునీరు లేక గొట్టాలే మిగిలాయి

28-01-2025 18:34:11

త్రాగునీరు లేక గొట్టాలే మిగిలాయి 

ఎల్ఎన్ పేట, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 28:

లక్ష్మీ నర్సు పేట మండలం మిరియాపల్లి గ్రామంలో కొద్ది నెలల కిందట జల్జీవన్ మిషన్ పథకంలో భాగంగా రక్షిత మంచినీటి సరఫరా కొళాయిలు ఏర్పాటు చేసేందుకు గొట్టాలు అమర్చారు. ఈ పనులన్నీ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అధికారి జేఈ రాజేశ్వరి పర్యవేక్షణలో జరిగిన అసంపూర్తి పనితో గుత్తేదారు పని ముగించుకుని పోయారు. అనంతరం వీటి గురించి పట్టించుకోకపోవడంతో ప్రజాధనం 38 లక్షల రూపాయలు వృధా అయిందని ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా పరిస్థితి మారింది దీంతో తాగునీటి సమస్య తీరుతుందని భావించిన గ్రామ ప్రజలు చివరకు నిరాశే మిగిల్చింది రానున్న వేసవికాలంలో గుక్కెడు మంచినీళ్లు కోసం ఐదు ఆరు కిలోమీటర్ల వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.