Sidebar


Welcome to Vizag Express
జాతీయ స్థాయి క్రీడాకారుడికి ఆర్థిక సహాయం

28-01-2025 18:36:09

జాతీయ స్థాయి క్రీడాకారుడికి ఆర్థిక సహాయం 


ఇచ్ఛాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 28

 అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటుతున్న తిప్పన పుట్టుక గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి అజిత్ కి ఈదుపురం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అకాడమీలో కోచింగ్ కొరకు రూ. 15,500 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మంగళవారం పాఠశాల హెచ్ఎం తిమ్మయ్య చేతుల మీదుగా అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన అజిత్ ఈదుపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్ వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుకుంటూ అథ్లెటిక్స్ క్రీడల్లో రాణిస్తున్నాడు. అండర్ -18 విభాగంలో 800 మీటర్ల పరుగు పందెంలో రాష్ట్రస్థాయిలో బంగారు పతకాలు సాధిస్తూ జాతీయ స్థాయి పోటీలకు 6 కిలోమీటర్ల పరుగు పందెంలో కూడా రాణించి పతకాలు సాధించాడు. ఈ ఏడాదిలో జరగనున్న ఏషియన్ గేమ్స్ కొరకు రూర్కెలాలో  ఒక అకాడమిలో శిక్షణ పొందుతున్నాడు. క్రీడాకారుడు పేదరికం కావడంతో శిక్షణకు దూరమవుతున్న విషయం తెలుసుకున్న పాఠశాల హెచ్ఎం తో పాటు ఉపాధ్యాయులు కలిసి రూ 15500 ఆర్థిక సహాయం అందించటం పాటు ప్రతి నెల రూ 2500 ఇస్తామని విద్యార్థికి హామీ ఇచ్చారు. ఇప్పటివరకు రాష్ట్రస్థాయిలో బంగారు పతకాలు, మహారాష్ట్రలో జరిగిన జాతీయస్థాయి 800 మీటర్ల పరుగు పందెంలో, గుజరాత్ లో జరిగిన 800 మీటర్ల పరుగు పందెంలో కూడా పతకాలు సాధించాడని తెలిపారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.