Sidebar


Welcome to Vizag Express
కేశుపురం పంచాయతీ సమస్యలు పరిష్కరించండి

28-01-2025 18:39:53

కేశుపురం పంచాయతీ సమస్యలు పరిష్కరించండి 

 ఇచ్ఛాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 28

కేశుపురం పంచాయతీ పరిధిలో గల కేశుపురం, సన్యాసిపట్టుగా, నీలాపుపుట్టుగా గ్రామాల్లో గల సమస్యలను పరిష్కరించాలని టిడిపి సీనియర్ నాయకులు బాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు ప్రభుత్వ విప్ నియోజకవర్గ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ను కోరారు. ఈ వేరకు మంగళవారం రామయ్య పుట్టుగా పార్టీ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. కేశుపురం బహుదా గ్రోయిన్ ఆధునికరించి నిర్మాణం చేపట్టాలని, కేసు పురం చిన్న గడ్డలో కాజ్ వే నిర్మాణం చేపట్టాలని, చిన్న గడ్డ నుంచి కొల్లే బట్టి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని, కేశుపురం పంచాయతీ పరిధిలో గల అన్ని గ్రామాలలో ప్రతి ఇంటింటికి మంచినీటి కొళాయిలు ఏర్పాటు చేయాలని పెద్ద లక్ష్మీపురం నుండి కేశుపురం  వేదుగా ఇచ్చాపురం వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని, పంచాయతీ పరిధిలో అన్ని గ్రామాలకు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ దాసరి రాజు, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బుద్దాల నిర్మలారెడ్డి, కూటమి నాయకులు సహదేవ రెడ్డి, పద్మనాభం, కామేష్ పాల్గొన్నారు.