ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ:
నర్సీపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 28:
ముఖ్యమంత్రి సహాయనిధి ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు.
నర్సీపట్నం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం
నర్సీపట్నం, పెదబొడ్డేపల్లి కి చెందిన బోలెం రాజబాబు సతీమణి లక్ష్మికి 1,54,215 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ఆరు నెలల కూటమి ప్రభుత్వం ఉన్న సమయంలో, నియోజకవర్గంలోని 16 మందికి సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు అందజేయడంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కృషి చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ 10వ వార్డ్ కౌన్సలర్ రాజుల నాయుడు, టిడిపి కార్యకర్తలు సబ్బవరపు అప్పలనాయుడు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.