Sidebar


Welcome to Vizag Express
ఘనంగా జరిగిన అగనంపూడి ఆర్టీవో కార్యాలయ వార్షికోత్సవం

28-01-2025 18:49:31

ఘనంగా జరిగిన అగనంపూడి ఆర్టీవో కార్యాలయ వార్షికోత్సవం
ఆర్టీవో వి జయప్రకాశ ని సన్మానించిన కుటమి నాయకులు
   గాజువాక - వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 28,           అగనంపూడి ఆర్టీవో కార్యాలయం వార్షికోత్సవం సందర్భంగా ఆర్టీవోవి జయప్రకాష్ ని కుటమీ నాయకులు దుస్సాలువ కప్పి మెమొంటు అందజేసి ఘనంగా సన్మానం చేసి కేకు కట్ చేపించి ఆర్టీవో స్టాప్ కి స్థానిక వాహనదారులకి కేకు స్వీట్స్ పంచి పెట్టడం జరిగినది. అనంతరం వి జయప్రకాష్ మాట్లాడుతూ వాహనదారులు సంపూర్ణ సహకారముతో కార్యాలయం ప్రగతి పథంలో నడుస్తుందని. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర నినాదం తో కార్యాలయం పరిశుభ్రం చేస్తున్నామని అన్నారు. ఆర్టీవో కార్యాలయ పనులు స్టాపు నిబద్ధత వాహనదారునికి మెరుగైన సేవలు చేస్తున్నారని ఎవరికీ ఇబ్బంది కలిగిన నేరుగా నన్ను కలవాలని చెప్పారు. మిమ్మల్ని గుర్తుంచుకొని వార్షికోత్సవ సందర్భంగా వచ్చి అభినందించినందుకు కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.
    ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ గాజువాక ఆర్టీవో కార్యాలయం శ్రీనగర్ ఆటోనగర్లో ఉండేదని అప్పటి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వాహనదారులకు సౌలభ్యంగా ఉండటానికి చొరవ తీసుకొని జాతీయ రహదారి పక్కన అగనంపూడిలో ఐదు ఎకరాల్లో ఆర్టీవో కార్యాలయం కట్టించి ఇదే నెలలో.ప్రారంభించితిరి. వైయస్సార్సీపి ప్రభుత్వం ఐదేళ్లలో డ్రైవింగ్ లైసెన్స్ సి బుక్స్ కి కార్డులు ఇప్పించలేన దుస్థితిలో రోడ్డు రవాణా శాఖ ని నిర్వహించారని దేశంలో పలు చిన్న రాష్ట్రాల్లో కూడా ఐడి కార్డులు ఇవ్వడంలో ముందుగా ఉన్నారని ఇచ్చట లేకపోవడం చాలా ఘోరమని అన్నారు. ఆర్టీవో కార్యాలయంలో మౌలిక సదుపాయాలు ఇంకా ఏర్పాటు చేయాలని యువకులకు రక్షణగా డ్రైవింగ్ లైసెన్స్ ఎల్ ఎల్ ఆర్ ఇవ్వడానికి మేళాలు ఏర్పాటు చేయాలని కోరారు.
       ఏ డి సి డైరెక్టర్ స్థానిక వర్తక సంఘం కార్యదర్శి మంగళ అచ్యుత సత్య రావు సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బిజెపి నాయకులు అంగుళూరి ఈశ్వరరావు జనసేన పార్టీ నాయకులు మోటూరి వెంకటరమణ టిడిపి నాయకులు బండారు చందు రమేష్ సింగడు సింహాచలం  గల్లా రుద్రకుమార్ వాటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాసరావు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఏ కృష్ణమోహన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి సౌజన్య వై లలిత సీనియర్ అసిస్టెంట్ పి సూరిబాబు జూనియర్ అసిస్టెంట్ మల్లికా అకిలతర్ హెడ్ కానిస్టేబుల్ ఎం నాగరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.