Sidebar


Welcome to Vizag Express
మిస్సింగ్ శాలరీ లు, ఇన్కమటాక్స్ అమౌంట్ చెల్లించాలని ఆందోళన

28-01-2025 18:51:14

మిస్సింగ్ శాలరీ లు, ఇన్కమటాక్స్ అమౌంట్ చెల్లించాలని ఆందోళన    గాజువాక   - వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 28                 మిస్సింగ్ శాలరీలు , ఇన్ కం టాక్స్ అమౌంట్ చెల్లించాలని డే అండ్ నైట్ 24, 25 ప్యాకేజీలు 64,65 68, 69, 85 వార్డుల పారిశుధ్యం కార్మికులు నిరసన కార్యక్రమం ఉదయం వార్డు మస్తర్ ఆఫీసుల వద్ద నిర్వహించారు.  జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గాజువాక జోన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఎం. రాంబాబు (సిపిఎం కార్యదర్శి) పాల్గొని మాట్లాడుతూ, ఆప్కాస్ ద్వారా 21000/- జీతం తీసుకుంటున్న కార్మికులు, కాంట్రాక్ట్ క్లాప్ ఆటో లోడర్స్ గా పనిచేస్తున్నారు. ఇందుకు కారణం అధికారులు ఒత్తిడి చేస్తున్నారు అని అన్నారు. పనిచేసే కార్మికులు కంటే    పెత్తనం చెలాయించే వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు అని అన్నారు. జోనల్ ఆఫీస్లో,  జివిఎంసి అధికారులు, లేదా రాజకీయ నాయకులు ఇంట్లో పని కోసం      ప్రోత్సహిస్తున్నురు అని అన్నారు. వెంటనే ఈ పద్ధతి మానుకోవాలి అని అన్నారు. ఓ పక్క రిటైర్మెంట్ మరో పక్క సిక్కు తో అనారోగ్యం పాలై మరణిస్తూన్న కార్మికుల వారసులకు ఉద్యోగం భర్తీ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది అని అన్నారు. పనిముట్లు సరఫరా అంతంతమాత్రంగా ఉంది. సేఫ్టీ పరికరాలు సబ్బులు, కొబ్బరి నూనె, ఇచ్చి మూడేళ్లవుతుంది అని అన్నారు. వెంటనే పెండింగ్ సమస్యలు  పరిష్కరించాలి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రి  స్పందించి పది రోజుల్లో మిస్సింగ్ శాలరీలు, ఇన్కమ్ టాక్స్ అమౌంట్ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.   గొలగాని అప్పారావు (జనరల్ సెక్రెటరీ) సోమాధుల గణేష్, (వర్కింగ్ ప్రెసిడెంట్) బత్తిన మీనాక్షి, కసింకోట సత్యవతి శ్రామిక మహిళ (అధ్యక్ష కార్యదర్శి) నాగేశ్వరరావు, నడిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.