Sidebar


Welcome to Vizag Express
రెండు లక్షల రూపాయలు విలువ చేసే 79 మంది 10 వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ... దివిస్ సంస్థ వితరణ.

28-01-2025 18:53:34

రెండు లక్షల రూపాయలు విలువ చేసే 79 మంది 10 వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ... దివిస్ సంస్థ వితరణ.
 మధురవాడ,వైజాగ్ ఎక్స్ప్రెస్: పదవ తరగతి విద్యార్థులు అత్యంత శ్రద్ధతో కీలకమైన పదవ తరగతి పరీక్షలు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ ప్రేమ్ కుమార్ కోరారు. మంగళవారం చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో దివిస్ సంస్థ 79 మందిపదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ మోడల్ పేపర్ల ను పంపిణీ చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ నిష్ఠాత్తులైన ఉపాధ్యాయులు రూపొందించిన ఈ పుస్తకాలు అత్యంత ప్రాముఖ్యత కలవని, ఇవి సంపూర్తిగా చదువుకొని పరీక్షలు కు సిద్ధపడితే ప్రతి సబ్జెక్టులో 100 మార్కులు సాధించడం కష్టమేమీ కాదని అన్నారు.
 దివిస్ లేబరేటరీ సి ఎస్ ఆర్ విభాగం ప్రతినిధి సురేష్ మాట్లాడుతూ స్టడీ మెటీరియల్ పదవ తరగతి విద్యార్థులకు ఒక పదును పెట్టిన ఆయుధం వంటిదే అని విజ్ఞతతో వినియోగించుకుంటే విజయం సాధించ వచ్చన్నారు. 
 జిల్లా విద్యాశాఖ అధికారి, స్కూల్ ప్రధానోపాధ్యాయులు చంద్రంపాలెం విద్యార్థులపై ప్రేమతో ఇవి అందించాలని సూచించగా 2 లక్షల రూపాయల పైబడిన ఖర్చుతో దివిస్ సంస్థ అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గొట్టేటి రవి పాఠశాల ఉపాధ్యాయులు సోమయాజులు, కొటాన శ్రీను, దాసరి నాగేశ్వరరావు, వై. రత్నరాజు, చుక్క స్వామి తదితరులు పాల్గొన్నారు.