జర్నలిస్టు శ్రీనివాసరెడ్డి సేవలు అభినందనీయం
అనపర్తి, వైజాగ్ ఎక్స్ ప్రెస్ జనవరి 28:విద్యార్థి దశలోని పాత్రికేయ వృత్తి చేపట్టి మూడు దశాబ్దాలు పైగా సత్తి శ్రీనివాస రెడ్డి (ప్రభ శ్రీను) సేవలు అందించడం అభినందనీయమని అనపర్తి అయ్యప్ప స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ తేతలి త్రినాథ్ రెడ్డి ప్రశంసించారు.
ఐజేయు నాయకులు సత్తి శ్రీనివాసరెడ్డి జన్మదిన సందర్భంగా మంగళవారం గొలుగూరి బాపిరాజు విద్యా సంస్థ క్రీడా మైదానంలో జిబిఆర్ వాకర్స్ క్లబ్. యోగా క్లబ్. ఆధ్వర్యంలో శ్రీనివాస రెడ్డికి జన్మదిన వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా శాలువ కప్పి పుష్పమాలవేసి కేక్ కట్ చేసి
ఆనందోత్సవాలు జరుపుకున్నారు. తేతల రామిరెడ్డి మంగయ్య మ్మ మహిళా వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డిని వృద్ధులు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఎం. ఎన్. ఆర్ విద్యాసంస్థల అధినేత మల్లిడి అనంతరెడ్డి. ఓం శక్తి సత్సంగ్ ప్రతినిధి సత్తి రామారెడ్డి. రామకృష్ణ సేవాసమితి కార్యదర్శి లెఫ్ట్ శ్రీను. అనపర్తి వర్తక సంఘం అధ్యక్షులు కొవ్వూరి వెంకటరామారెడ్డి.
ఎస్ వి ఆర్ వ్యాపార సంస్థల అధినేత నారాయణరెడ్డి. వ్యాపార ప్రముఖులు కర్రీ సత్తిబాబు. పావని దొర. ఎన్.ఎస్.ఆర్ రాజా.
పేపర్ మిల్లు బుజ్జి. హెచ్ఎం పులగం వెంకటరెడ్డి. జిబిఆర్ వాకర్స్. యోగ. టెన్నిస్. షటిల్ క్లబ్ సభ్యులు పాల్గొని సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.