Sidebar


Welcome to Vizag Express
రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బొద్ధపు బంగార్రాజు

28-01-2025 19:45:58

రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బొద్ధపు బంగార్రాజు  


 ఆనందపురం, వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్, జనవరి 28.

 రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక గా  బోద్ధపు బంగారు రాజు నియమికమయ్యారు
 ఆదివారం తిరుపతిలో  యూత్ హాస్టల్లో నిర్వహించిన  ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర కమిటీ నియామకంలో    రాష్ట్ర ఉప అధ్యక్షులుగా    బొద్దపు బంగార్రాజును  ప్రజా సంకల్ప వేదిక  జాతీయ అధ్యక్షులు మదిరే రంగ సాయి రెడ్డి  నియమించారు. బంగార్రాజు   ఆనందపురం మండలం శొంఠ్యం గ్రామానికి చెందిన వ్యక్తి. అదే గ్రామంలో ఎలిమెంటరీ పాఠశాల,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 సంవత్సరాలు పేరెంట్స్ కమిటీ చైర్మన్ గా  సేవలు అందించి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలను పాఠశాలలకు  పూర్వ విద్యార్థులను కలుపుకుంటూ  పాఠశాలకు విద్యార్థులకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేసేవారు. వారి సేవాలను గుర్తించి ప్రజా సంకల్ప వేదిక బంగార్రాజు  నియమించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బంగార్రాజు  మాట్లాడుతూ నాకు అప్పగించిన బాధ్యతకు న్యాయం చేస్తానని నా సేవలను గుర్తించిన జాతీయ అధ్యక్షులకు, మిగతా కమిటీ మెంబర్లు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు