గాజువాకలో ఐటి శాఖ మంత్రిని కలిసిన మీ సేవ నిర్వాహకులు
28-01-2025 19:47:19
గాజువాకలో ఐటి శాఖ మంత్రిని కలిసిన మీ సేవ నిర్వాహకులు
గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 28
గత ప్రభుత్వం మీ సేవలో నిర్వీణ్యం చేయడంతో మీ సేవ నిర్వాహకులు నిరాశపడ్డారు, గతంలో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో, టిడిపి ప్రభుత్వ రాగానే మళ్లీ మీ సేవకి పూర్వ వైభవం తీసుకొస్తానని హామీ ఇచ్చారు, దీంతో మీ సేవ నిర్వాహకులు అందరూ కూడా చాలా ఆనందపడ్డారు, అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పలు మార్పులు జరగడంతో, మీసేవ నిర్వాహకులకి భరోసా పై మరొకసారి లోకేష్ గారిని రాష్ట్ర మీసేవ రామ్ ఇన్ఫో జనరల్ సెక్రటరీ చదరం తులసిరామ్ గారు కలిసి చర్చించారు, ఆయన మాట్లాడుతూ మీసేవ ని ఐటి శాఖలో కలుపు దామా ఇయస్ డి లో ఉంచుదామా ఎలా చేద్దాం మీరు చెప్పండి మీరు చెప్పిన దాన్ని బట్టి పరిగణలో తీసుకుని ఒక ప్లాన్ అఫ్ యాక్షన్ తీసుకుందాం మీరు ఒకసారి విజయవాడ రండి కూర్చొని మాట్లాడదాం అని భరోసా ఇచ్చారు దీనిపై ఒక కమిటీ కూడా వేద్దాం అన్నారు, ఈ కార్యక్రమంలో గాజువాక నుండి మీ సేవ నిర్వాహకులు సత్యనారాయణగారు అనంతరావు గారు, గణేష్ గారు, తదితరులు పాల్గొన్నారు