సొంత గనుల ప్రాధాన్యతను గుర్తించాలి
గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి28,
విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షిస్తారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ సొంత గనులు కేటాయించకుండా వాటి ప్రాధాన్యతను తగ్గిస్తూ మాట్లాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలు మార్చుకోవాలని అలాగే సొంత గనుల ప్రాధాన్యతను గుర్తించాలని రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ 27వ మహాసభ సందర్భంగా నేడు కూర్మన్నపాలెం దీక్ష శిబిరం నుంచి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమ జ్యోతిని మహాసభ వరకు తీసుకువెళ్లడం కోసం జరుగుతున్న జాత సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభను ఉద్దేశించి సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ ఇంకా ప్రారంభం కానీ ప్రైవేటు సంస్థకు గనులు కేటాయించమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని నేడు అడుగుతున్నారని ఆయన అన్నారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కోసం మాత్రం కేంద్రంపై ఒత్తిడి తేవడానికి వారికి గల అభ్యంతరాలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. నేడు దీన్ని రక్షిస్తామని ప్యాకేజీలు ప్రకటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. కానీ ప్రభుత్వాలు చెబుతున్నది ఒకటి నేడు ప్లాంట్ లో జరుగుతున్నది మరొకటిగా గమనించిన కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమాల బలపరచవలసిన ప్రాధాన్యత నేడు ఉందని ఆయన స్పష్టం చేశారు. కనుక ఆ దిశగా ఉద్యమిస్తున్న సిపిఎం పార్టీ కార్యకర్తలపై మరింత బాధ్యత ఉందని కనుక సిపిఎం పార్టీని జరుగుతున్న మహాసభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లోకనాథం మాట్లాడుతూ విశాఖ స్టీల్ ఉద్భవించడానికి అనేక పోరాటాలను సిపిఎం పార్టీ జరిపిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రజాధనాన్ని ప్రజలకే చెందాలని జరుగుతున్న పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి ఎం జగ్గు నాయుడు మాట్లాడుతూ ప్రజా పోరాటాలను అపహస్యం చేస్తున్న ప్రభుత్వ అధినేతలకు కళ్ళు తెరిచే విధంగా పోరాటాలను మరింత ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం 78 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు, జిల్లా సిపిఎం పార్టీ నాయకులు మణి సిపిఎం స్టీల్ డివిజన్ కార్యదర్శి పి శ్రీనివాసరాజు, జిల్లా సిఐటియు నాయకులు కె ఎం శ్రీనివాస్, ఆర్ఎస్ వి కుమార్, స్టీల్ సిఐటియు నాయకులు జె అయోధ్యరామ్, యు రామస్వామి, వైటి దాస్ పోరాట కమిటీ నాయకులు డి ఆదినారాయణ, రమణమూర్తి, దొమ్మేటి అప్పారావు, సిహెచ్ సన్యాసిరావు, శ్రీనివాస్, వరసాల శ్రీనివాస్ తదితరులతోపాటు ఐద్వా మరియు సిపిఎం పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
వి ప్రసాద్
కార్యదర్శి