Sidebar


Welcome to Vizag Express
జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం సందర్శన

28-01-2025 19:53:20

జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం సందర్శన 
రేగిడి జనవరి 28 వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్ 
రేగిడి ఆమదాలవలస మండలం బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంబాడ వెంకటాపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పనితీరును  విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ టాస్క్ ఫోర్స్ బృందం మంగళవారం నాడు తనిఖీలు నిర్వహించినారు. ఈ సందర్భంగా ఎమ్,ఎల్,హెచ్ పి, ఆరోగ్య కార్యకర్త మరియు ఆశా కార్యకర్తల రికార్డులు మరియు పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినారు. దీనిలో భాగంగా గర్భిణీలకు, పాఠశాల విద్యార్థులకు హెచ్ బి పరీక్షలు నిర్వహించి, ఆర్ సి హెచ్ సేవలు  గూర్చి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో డి పి హెచ్ ఎన్ ఓ  సత్యవతి, గణాంకాధికారి  ధర్మారావు, డిపిఓ రామానుజల నాయుడు, ఎం ఐ ఎస్ శ్రీనివాస్ విస్తరణ అధికారి రాధాకృష్ణ  మొదలగువారు పాల్గొన్నారు.