Sidebar


Welcome to Vizag Express
జిల్లాలో పోలీసుల అత్యుత్తమ పనితీరు అభినందనీయం *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమల రావు

28-01-2025 19:58:37

జిల్లాలో  పోలీసుల అత్యుత్తమ పనితీరు  అభినందనీయం

*ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమల రావు 

శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి 28. జిల్లాలో  పోలీసుల అత్యుత్తమ పనితీరు  అభినందనీయం అని జిల్లా పోలీసు అధికారుల, సిబ్బంది పనితీరు ప్రశంసించి,ప్రజలకు పారదర్శకంగా మెరుగైన పోలీసు సేవలు అందించి జిల్లా, రాష్ట్ర పోలీసు శాఖ యొక్క కీర్తి ,పేరు ప్రతిష్టలు పెంపొందించాలని ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర డిజిపి  ద్వారక తిరుమల రావు  పోలీసు అధికారుల ను సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం  ఉదయం  శ్రీకాకుళం జిల్లాకు విచ్చేశారు. ఈ క్రమంలో ముందుగా జిల్లా  పోలీసు కార్యాలయంలోని రాష్ట్ర డిజిపిని విశాఖపట్నం రేంజ్ డీఐజీ సిహెచ్ గోపీనాథ్ జట్టి, జిల్లా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర్ రెడ్డి,జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా,జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పండ్కర్,  జాయింట్ కలెక్టర్ ఫర్మాన్  అహ్మద్ ఖాన్, మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు. ఈ సంధర్బంగా ఆర్టిసి ఒకట,రెండవ డిపోల గ్యారేజ్లను సందర్శించి సిబ్బందితో మమేకమయ్యారు. అనంతరం  శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాల్లో గల పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి జిల్లాలో నేరాల నమోదు నియంత్రణకు చేపడుతున్న చర్యలు ప్రాపర్టీ నేరాలలో టెంపెల్, చైన్ స్నాచర్ల, ట్రాన్స్ఫార్మర్, బీహార్ సుఫారి తదితర గ్యాంగ్ కేసులు, నేరస్తులు , ప్రాపర్టీ ఛేదింపు,జిల్లాలో సంకల్పం పేరిట గంజాయి,సైబర్ నేరాలు,నియంత్రణ, మహిళలు,మైనర్ బాలికలపై జరుగుతున్న నేరాలు అరికట్టుట,రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు ద్వార నేరాలు నియంత్రణకు ప్రటిష్ట చర్యలు చేపట్టడం జరిగిందని,ఈ క్రమంలో గత ఏడాదిలో 17 శాతం నేరాలు తగ్గాయని, జిల్లాలో 460 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని,సురక్ష కార్యక్రమాల్లో 520 సీసీ కెమెరాలు ఇప్పటివరకు అదనంగా ఏర్పాటు చేశామని,డ్రోన్ ఉపయోగం పెరిగింది అని,రథసప్తమి బందోబస్తు ఏర్పాట్లు,అరోగ్య రక్ష క్రింద జిల్లా పోలీసులు కు ఆరోగ్య పరీక్షలు చేయించి, డిజిటల్ హెల్త్ కార్డుల జారీ చేయడం జరిగిందని, తద్వారా ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఆని ఈ సందర్భంగా డిజిపి వారికి జిల్లా ఎస్పీ పై వివరాలు తెలియజేశారు. సమీక్ష సమావేశంలో డిజిపి మాట్లాడుతూ గత 7 నెలలో జిల్లాలో  పోలీసుల అత్యుత్తమ పనితీరుతో మంచి ఫలితాలు సాధించడం అభినందనీయం అని జిల్లా పోలీసు అధికారులు,సిబ్బంది పనితీరు ప్రశంసించి,ప్రజలకు పారదర్శకంగా మెరుగైన పోలీసు సేవలు అందించి జిల్లా,రాష్ట్ర పోలీసు శాఖ యొక్క కీర్తి ,పేరు ప్రతిష్టలు పెంపొందించాలని  సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పి.శ్రీనివాసరావు, కెవి రమణ, డీఎస్పీలు, సీఐలు,విజయ నగరం జొన్ ఈడి ఏ విజయ కుమార్, విశాఖపట్నం రీజియన్ ఆర్.ఎం బి. అప్పల నాయుడు ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు .