హెల్మెట్ ఉండాల్సిందే.. ఎస్సై యాసిన్
హిర మండలం, వైజాగ్ ఎక్స్ ప్రెస్ జనవరి 28:
ద్విచక్ర వాహనాలు నడిపిన ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరించాల్సిందే నని స్థానిక ఎస్సై మహమ్మద్ యాసిన్ మంగళవారం హిర మండలం లోని చిన్న కోరాడ జంక్షన్ వద్ద వాహనదారులు ను ఉద్దేశించి సూచించారు... ఈసందర్బంగా ఎస్సై ఎం డి యాసిన్ మాట్లాడు చూ
రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని . సిసి కెమెరాలు చూసి చర్యలు తీసుకునే విధానం తగ్గించి నేరుగా రోడ్లపైనే నిలబడి చలాన్లు వసూలు చేయడం జరుగుతుందని ఇక నుంచి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల ని ఆదేశాలు ప్రభుత్వం జారీ చేయడం జరిగిందని అన్నారు...
99 శాతం మంది హెల్మెట్ లేకుండానే వాహనాలు నడుపుతున్నారని ఇది ఎంత మాత్రం క్షేమం కాదని ఆందోళన వ్యక్తం చేశారు వాహనాలు నడిపే వ్యక్తి కాకుండా వెనుకున కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని కోర్టు ఆదేశించిందని
ఒక్క హెల్మెట్ విషయమే కాకుండా ఆటోల్లో కూడా పరిమితికి మించి జనాలను ఎక్కిస్తున్నా రని తెలిపారు..ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు....