శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవానికి అయ్యన్నకు ఆహ్వానం: నర్సీపట్నం,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 28: ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సందర్భంగా, నర్సీపట్నం ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సేవా ట్రస్ట్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఈనెల 31న నిర్వహించనున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమానికి, నర్సీపట్నం శాసనసభ్యులు,స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడును సేవా ట్రస్ట్ ప్రతినిధులు మంగళవారం ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలచే 108 కలశాలతో నగర సంకీర్తన, అదేవిధంగా కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి సేవా ట్రస్ట్ ప్రతినిధులు సుతాపల్లి శ్రావణ్,పూసర్ల సోమేశ్వరరావు, జాలుమూరి బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు.