కబ్జాకోర్లు పై క్రిమినల్ కేసులు పెట్టాలి
పార్వతీపురంలో మాయమవుతున్న చెరువులు, గెడ్డలు, ప్రభుత్వ స్థలాలు
పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 28:
కబ్జాకోర్లుపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు కోరారు. మంగళవారం ఆయన ఆ సమితి ప్రతినిధులు రేజేటి దయామణి, చుక్క చంద్రరావు, భవిరిపూడి పోలినాయుడు, వండాన నేతాజీ తదితరులతో కలిసి పార్వతీపురం లోని వైకెయం కాలనీకి ఎదురుగా ఉన్న అఫీషియల్ కాలనీలోని కబ్జాకు గురవుతున్న వెంకమ్మ చెరువు గెడ్డ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పార్వతీపురం తహసిల్దార్ జయలక్ష్మీ తో మాట్లాడుతూ
పార్వతీపురంలో చెరువులు, గెడ్డలు తదితర నీటి వనరులతో పాటు ప్రభుత్వ స్థలాలను కబ్జాదారులు దర్జాగా కబ్జా చేస్తున్నారన్నారు. అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడు భయపడి కబ్జా జోలికి రారన్నారు